వైద్యం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యమైన చికిత్స కారణంగా ఎంతో మంది ప్రాణాల మీదికి తెస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఈ క్రమంలోనే ఒక వైద్యుడు నిర్లక్ష్యంపై నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పును ఇచ్చారు. మహిళ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు ఏకంగా బాధిత కుటుంబానికి 15 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ తమిళనాడులోని రాయవేలూరు సిఎంసి కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. నెల్లూరు జిల్లా ఏఎస్ పేటకు చెందిన ఫాతిమ్ భార్య రషీలాబాను కాన్పు కోసం వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేరింది. అయితే 2017 లో శస్త్ర చికిత్స చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళింది అయితే కడుపు నొప్పి రావడంతో సుమారు 2017 తర్వాత విజయవాడ హైదరాబాద్ వేలూరు వంటి నగరాల్లో ఉన్న తొమ్మిది ఆసుపత్రిలో వైద్యం పొందిన లాభం లేకుండా పోయింది. 2017లో చివరికి కిమ్స్ లో చేరగా రశీలభాను కడుపులో దూది ముక్క ఉందని వైద్యులు తేల్చారు.. శస్త్ర చికిత్స చేసి కడుపులోని దూది ముక్కలు తొలగించారు. ఈ క్రమంలోనే రశిలా భాను ఇదే విషయంపై నెల్లూరు వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై విచారణ జరుపగా ఇక రశీలభాను కు 15 లక్షల పరిహారం చెల్లించాలని సిఎంసి యాజమాన్యం నీ ఆదేశించింది నెల్లూరు వినియోగదారుల కమిషన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి