ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. అతివేగం ప్రమాదకరం అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఎందుకో తమ వాహనాన్ని వేగంగా నడపడానికి అందరూ ఇష్టపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ప్రాణాల మీదికి వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇక డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా వాహనదారుల నిర్లక్ష్యం కొన్ని కొన్ని సార్లు వారి ప్రాణాల మీదికి తెస్తూ ఉంటే.. మరికొన్నిసార్లు అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను తీసేస్తున్న ఘటనలు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్.



 నేటి రోజుల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఎంతోమంది రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై జీవచ్చావాలుగా  మారిపోతూ ఉన్నారు. ఇక ఇలా రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల మధ్యప్రదేశ్లో కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవలం ఒకే ఒక్క ఘటన ఏకంగా 12 మందిని బలి తీసుకుంది అని చెప్పాలి. దీంతో సంఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి అని చెప్పాలి.


 మధ్యప్రదేశ్ లోని సప్న సరిహద్దుల్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రెండు బస్సులను కూడా వేగంగా దూసుకు వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో ఏకంగా 12 మంది దుర్మరణం పాలయ్యారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక మరో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయట. అయితే అమిత్ షా ర్యాలీ నుంచి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని విగత జీవులుగా ఉన్న తమ ప్రియమైన వారిని చూసి అరణ్య రోదనగా విలపించారు. కాగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: