
ఎందుకంటే ఒక్కసారి పెళ్లి అనే బంధంతో ఒక్కటైన తర్వాత కష్టసుఖాల్లో ఒక్కరికి ఒకరు తోడు నీడగా నిలవాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ఇక సర్దుకుపోతూ దాంపత్య జీవితాన్ని ఎంతో విజయవంతంగా లీడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం దంపతులు మధ్య అన్యోన్యత అనేది ఎక్కడ కనిపించడం లేదు. చిన్నచిన్న కారణాలకే తోడునీడగా ఉండాల్సిన కట్టుకున్న వారు బద్ద శత్రువులుగా మారిపోతున్నారు. చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.
ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటనే వెలుగు లోకి వచ్చింది. రోజు తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను చెంబు తో కొట్టి చంపేసింది భార్య. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లంక లో జరిగింది. రామకృష్ణ అనే వ్యక్తి తాగొచ్చి భార్య నారాయణమ్మతో పాటు అతడు తల్లిదండ్రులను తరచూ కొడుతూ ఉండేవాడు. ఇటీవలే మరోసారి ఇలాగే ఫుల్లుగా తాగొచ్చి ఇక ఇంట్లో వాళ్లతో గొడవపడ్డాడు రామకృష్ణ. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భార్య నారాయణమ్మ భర్త తలపై చెంబుతో బలంగా కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే దాడి అనంతరం నారాయణమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.