అయితే ఇలా బిర్యాని తినడానికి వెళ్ళిన వారు.. చివర్లో పెరుగుతో ముగించడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా పెరుగుతో ముగించాలి అనుకున్నాడు. కానీ పెరుగు మీద అతనికి ఉన్న ఇష్టమే చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అస్సలు ఊహించలేకపోయాడు. ఏకంగా పెరుగు కోసం హోటల్ సిబ్బందితో గొడవపడ్డాడు. చివరికి హోటల్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది.
లికాయత్ అనే వ్యక్తి పంజాగుట్టలోని మెరీడియన్ హోటల్లో బిర్యాని తినడానికి వచ్చాడు. అయితే తనకు పెరుగు కావాలని సిబ్బందిని అడిగాడు. ఈ క్రమంలోనే హోటల్ సిబ్బందికి లిఖాయత్ కు మధ్య మాట పెరిగి వాగ్వాదం జరిగింది. దీంతో అతనిపై సిబ్బంది దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్కు చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే పోలీసులతో మాట్లాడుతూనే లిఖాయత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని హాస్పిటల్కు తరలించారు. చివరికి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలోనే దాడికి పాల్పడిన హోటల్ సిబ్బందిని పోలీస్ ఆఫీసులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి