
ఓ మహిళ తన భర్త ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్రియుడితో కారులో షికారుకు వెళ్ళింది. ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ తో వెళ్తున్న భార్య తన భర్తకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో తన భార్యను మరొక వ్యక్తితో చూసిన భర్త ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. తన భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని స్వయంగా నీళ్లతో కడిగేశాడు. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ చేత మళ్లీ తన భార్య నుదుటిపై సింధూరాన్ని దిద్దించాడు. కానీ ఆ మహిళకి బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి ఇష్టం లేనట్టుగా కనిపించింది. హిందూ సంప్రదాయల ప్రకారం నుదిటిపై బొట్టు పెడితే పెళ్లి అయిపోయినట్లుగా భావిస్తారు. అందుకే ఆ మహిళ భర్త, తన భార్యకి నుదిటిపై సింధూరం పెట్టించి ప్రియుడితో పెళ్లి జరిపించాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కొందరు ఎంత గొప్ప మనసయ్య నీది ఒక మాట మాట్లాడకుండా పెళ్లి చేసేసావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ప్రియుడుతో కలిసి నిన్ను చంపేయ్యాక ముందే మేల్కొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మంచి పని చేశావు అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు.