ముఖ్యంగా కాకినాడ ఎంపీ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జనసేన పార్టీలో చాలా మంది చేరారు. తర్వాత చాలా మంది వెళ్లిపోయారు. జేడీ లక్ష్మినారాయణ లాంటి వారు సైతం జనసేన పార్టీలో వైజాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. చాలా మంది సీనియర్ నాయకులు చేరినా వారు మధ్యలోనే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. నాదెండ్ల మనోహర్ తప్ప మిగతా సీనియర్లు అందరూ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే దాదాపు 10 నెలల్లోపు ఎన్నికలు రానున్నాయి.
ఈ సందర్భంగా ఆంధ్రలో టీడీపీ, వైసీపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు తమ కార్యచరణతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. లోకేశ్ ఒక అడుగు ముందుకేసీ యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిపోయారు. యాత్ర రోజు రోజుకు ప్రజలకు చేరువ అయినట్లు కనిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
పవన్ మంగళగిరిలోని తన నివాసంలో ఇటీవల హోమం నిర్వహించారు. హోమం పూర్తయిన తర్వాత వారాహి యాత్ర ప్రారంభిస్తారు. వారాహి యాత్ర అనేది విజయవంతం కావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర వల్ల ఏ మేరకు జనసేనకు ఉపయోగమవుతుందనేది ఇక్కడ ప్రశ్న. వారాహి, యువగళం, చంద్రబాబు, పవన్ కల్యాణ్, టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు కలిసి వైసీపీని ఓడిస్తారా లేదా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి