సీమరా ఇది... రాయలసీమ...రాయలసీమ గడ్డ..అంటూ మీసం మేలేసిన సీన్లు మనం నిత్యం చూస్తుంటాం. ఈ ఘటనలు కొన్ని సినిమాలలోనూ కనకు కనువిందు చేస్తుంటాయి. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నేల స్వభావం, మాండలికం, జన జివితం, వారి బతుకులు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతాయి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని వై.ఎస్.|ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్తీకరణకు పచ్చజెండా ఊపింది
రాజకీయాలకు వస్తే నెల్లూరుజిల్లాలో  మూడు నియోజక వర్గాలు గూడూరు, సూళ్లూరు పేట, వెంకట గిరి నియోజక వర్గాలు  కొత్తగా ఏర్పాటు కానున్న బాలాజీ జిల్లా పరిధిలోకి చేరాయి. ఇప్పటి వరకూ ఆధ్యాత్మిక నగరిగా ఉన్న తిరుపతి ఇకనుంచి జిల్లా కేంద్రంగా మారనుంది.  నెల్లూరు జిల్లాలో  ఇప్పటి వరకూ  నేదురుమల్లి,  నల్లపు రెడ్డి, ఆనం కుటుంబాలు రాజకీయంగా చక్రం తిప్పాయి.నేదురు మల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన సతీమణి నేదురు మల్లి రాజ్యలక్ష్మి, దివంగత నేత  వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. వారు కుమారుడు నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నూటచిల్లర కార్పోరేషన్ లలో ఒక దానికికి చైర్మన్ గా క్యాబినెట్ హోదాలో ఉన్నారు. వారి స్వస్థలం గూడూరు నియోజక వర్గంలోని వాకాడు. వారి ఇప్పటి వరకూ ప్రాతినిథ్యం వహించిన  నియోజక వర్గం వెంకటగిరి.
ఇక నెల్లూరు జిల్లాలో చెప్పుకోవలసిన ప్రముఖ రాజకీయ కుటుంబం నల్లపు రెడ్డి.. ఈ కుటుంబం నుంచి నల్లపు రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి జిల్లాలోను, రాష్ట్రా రాజకీయాలలోనూ చక్రం చిప్పారు. చంద్ర శేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్, ఎం.ఎల్.ఏ గా సేవలందిచారు. ఇక నల్లపు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్  మంత్రిగా  చాలా కాలం పని చేశారు. ఈ కుటుబం స్వస్థలం కోట.  ఆ పంచయతీ  ఇప్పటికీ వీరి ఏలుబడిలోనే ఉంది. కోట గ్రామం గూడూరు నియోజక వర్గం పరిధిలో ఉంది. దీంతో ఈ కుటుంబం కూడా బాలాజీ జిల్లా పరిధిలోకి వచ్చింది.
 నెల్లూరి జిల్లా  అన్నా... అక్కడి రాజకీయం అన్నా వెంటనే గుర్తుకు వచ్చేది ఆనం కుటుంబం. దివంగత ఏసీ సుబ్బా రెడ్డి, వెంకట రెడ్డి, సంజీవ రెడ్డి, వివేకానందరెడ్డి అందరూ  రాష్ట్ర ప్రజలకు చిరపరిచితులే. అదే కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కు ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజక వర్గానికి శాసన సభ్యుడిగా ఉన్నారు. ఈ వెంకటగిరి నియోజక వర్గం కూడా కొత్తగా ఏర్పాటు కానున్న బాలాజీ జిల్లాకు కేటాయించారు.
దీంతో ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో తమదైన మార్కు చూపిన నెల్లూరు నేతల కుటుంబ సభ్యులు ఇకపై రాయలసీమ లో రాజకీయం చేయాల్సి ఉంటుందనేది సుస్పష్టం. ఈ పరిణామాన్ని రాయల సీమ నేతలు ఎలా స్వీకరిస్తారో చూడాలి మరి ..


మరింత సమాచారం తెలుసుకోండి: