ఉండవల్లి శ్రీదేవి ఎలాంటి పనులు చేసిందో పూర్తిగా బయట పెడుతున్నారు వైసీపీ నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా అమ్ముడుపోయినట్లు ఆధారాలతో సహా నిరూపించేందుకు వైసీపీ పార్టీ సిద్ధమవుతోంది. దీని కోసం  రాపాక వరప్రసాద్ ను రంగంలోకి దించారు. ఆయన వాదన ప్రగకారం..  హైదరాబాద్ లో స్వాగత్ హోటల్ కు చెందిన కృష్ణారెడ్డి, బొల్లినేని మాధవరావు అనే మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఉండవల్లి శ్రీదేవిని హైదరాబాద్ లోని సుజానా చౌదరి ఇంటికి తీసుకెళ్లారు. వీరందరూ కలిసి ఏబీఎన్ రాధాకృష్ణ ను కలవడానికి శ్రీదేవిని తీసుకెళ్లారు.


మూడు రోజుల ముందు ఎమ్మెల్సీ ఓటు వేయాల్సి ఉండగా కృష్ణారెడ్డి, బొల్లినేని మాధవరావు ఇద్దరు కలిసి ఉండవల్ల శ్రీదేవి కూతురు ను చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారని కారు నెంబర్ తో సహ రాపాక వెల్లడించారు. చంద్రబాబు నాయుడిని కలిసిన శ్రీదేవి కూతురు దాదాపు రూ.4.5 కోట్ల రూపాయాలను స్వయంగా తీసుకెళ్లినట్లు ఆరోపించారు. ఈ డబ్బులను తీసుకొని హైదరాబాద్ వెళ్లినట్లు చెప్పారు. ఉండవల్లి శ్రీదేవి అనే ఎమ్మెల్యే తన ఫోన్లు, ఆమె కుతూరు ఫోన్లు గనక ఇస్తే పూర్తి వివరాలు బయటపడతాయని చెప్పారు.


గత ఆరు నెలల నుంచి టీడీపీతో ఆమె టచ్ లో ఉన్నట్లు చెప్పారు. మూడు రాజధానుల వద్దు అమరావతి ముద్దు అని ఉండవల్లి శ్రీదేవి కూడా కొన్ని రోజులుగా అమరావతి రైతులను కలవడం, టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు వైసీపీకి తెలిసింది. అనుకున్నట్లుగానే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడం, తద్వారా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని  వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా జరగడం వెనక ఉన్న ప్రతి ఆధారాన్ని వైసీపీ చూపించడానికి సిద్ధంగా ఉందని రాపాక వెల్లడించారు. ఉండవల్లి శ్రీదేశి ఎప్పుడు, ఎక్కడ టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నారో అన్ని వివరాలు తెలుసని, సీసీ కెమెరాల పుటేజీలు చూస్తే తెలుస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: