అనంతపురం జిల్లాలో సాగునీరు, ఆఖరికి తాగునీరు కూడా  లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ జనం. అక్కడ ప్రతి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది చేస్తామంటారు తర్వాత జరగని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా, ఎవరైనా ఏర్పాటు చేసినా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అక్కడ నీటిని రెగ్యులర్గా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు.


కానీ అలాంటి సమయంలో కూడా ఆ నీటిని అమ్మేవారికి నీరు వస్తుంది గాని, కొనుక్కునే వారి ఇంటికి మాత్రం నీరు రానటువంటి పరిస్థితి ఉంది. మొన్న లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ సమస్య స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని దైవాలమడుగు గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది అనే సమస్యను అక్కడ మహిళలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సరిహద్దు గ్రామం దైవాలమడుగుకి లోకేష్ వెళ్తే అప్పటికే లోకేష్ కోసం వేచి చూస్తున్నారు.


గ్రామాల్లోకి ఆయన అడుగుపెట్టగానే మహిళలు నీటి సమస్యలు వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి త్రాగునీటి సమస్య తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. గ్రామంలో పది రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావడం కష్టంగా ఉందన్నారు. అక్కడ టిడిపి హయంలో నీరు వస్తే వైసిపి వాళ్ళు ఆపేశారా? ఎందుకంటే అంతకు ముందు చాలాకాలం టి.డి.పి అధికారులు ఉంది కదా, అప్పుడు కూడా నీటి సమస్య ఉందా అనే స్పష్టత లేకుండా వార్తలు అయితే రాసేస్తున్నాయి కొన్ని పత్రికలు.


ఇదివరకు అక్కడ నీళ్లు వస్తూ ఉంటే ఆపేశారా అనేది కనుక్కుంటే బెటర్ కదా అని కొంతమంది అభిప్రాయం. ఒకవేళ ఎప్పటినుండో అక్కడ నీరు రాకపోతే ఉంటే కనుక అది అక్కడ శాశ్వత సమస్య అయితే గతంలో తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వై.ఎస్.ఆర్‌.సి.పి ఉన్నాయి కదా. అలా కాకుండా ఇప్పుడే ఈ నీటి సమస్య అనేది వస్తే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి దీనికోసం ఏం చేశారని, ఏం చేస్తారని అంటున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: