భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏదో జరుగుతుంది. ఎందుకంటే గతంలో అక్కడ ఏం జరిగిందో మీడియాకు మేటర్ ఏదోరకంగా ఎవరో ఒకరు అందిస్తూ ఉండేవారు. అప్పుడు మీడియా దానిపై మాట్లాడేది. కొంచెం అటు ఇటుగా ఏదైనా చర్చ వస్తే దానిమీద మన సైన్యం లేదా మన ప్రభుత్వం దానిపై సమాధానం చెప్పేది. అయితే ఇప్పుడు మీడియాకి ఉప్పందించే వాళ్లు లేకపోయారో,  లేదంటే సరిహద్దుల్లో అసలు ఏమీ జరగటం లేదో తెలియదు.


కానీ సరిహద్దుల్లో అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అంతా ప్రశాంతం అని అనుకున్నారు. అయితే వాళ్ళ, పాకిస్తాన్ కు సంబంధించిన సైనిక చీఫ్ ఏమని చెప్పారంటే భారత్ కి సంబంధించిన వాయు దళానికి సంబంధించిన యుద్ధ విమానాలు మా గగనతలంలోకి ప్రవేశించాయి‌ మేం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. ఇంకా భారత్ కాశ్మీర్ విషయంలో చేస్తున్నది కరెక్ట్ కాదు, దీనికి మేము సమాధానం చెప్తామని అంటున్నారు వాళ్ళు.


అయితే దీనిపై మన సైనికులు ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే పాకిస్తాన్ వాళ్ళు చెబుతున్నది ఏంటంటే గత నాలుగు నెలల్లో భారత్ 56 సార్లు పాకిస్తాన్ స్థావరాలపై దాడులు చేసిందని చెప్తుంది. కాల్పుల విరమణ పేరుతో మేము భారత్ పైకి దాడులు చేయడం మానేస్తే, భారతదేశం, భారతదేశానికి సంబంధించిన సైన్యం మాత్రం తీవ్రవాదులు అనే పేరు చెప్పి వారి మీద దాడి చేస్తున్నారని, మా వాళ్లపై కాల్పులు జరుపుతున్నారని అభియోగం చేసింది.


అసలు, మాట తప్పేది, కాల్పుల విరమణ ఒప్పందాలు తప్పేది పాకిస్తాన్. ఇప్పటివరకు మనం చూసిందీ, మనకు తెలిసిందీ అదే. నిజం కూడా అదే అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది విచిత్రంగా భారత్ మీద, భారత్ సైన్యం మీద నేపాన్ని నెట్టేసి తనకి మాత్రం ఏ పాపం తెలియదన్నట్లుగా నటిస్తుంది పాకిస్తాన్ సైన్యం. దీనిపై భారత సైన్యం ఏమంటారో చూడాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR