ఇక భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 20 బిజినెస్‌ కరెస్పాండెంట్‌ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇక ఇప్పటికే పలు బ్యాంకుల్లో చీఫ్‌ మేనేజర్‌ కేడర్‌లో పనిచేసినవారు, అలాగే రిటైర్డ్‌ క్లర్క్‌, ఎమ్మెస్సీ/బీఈ/ఎంసీఏ/ఎంబీఏ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. ఇంగ్లిష్, హిందీ ల్యాంగ్వేజ్‌లలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 21 నుంచి 65 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్త కలిగిన వారు సెప్టెంబర్‌ 19, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండానే నేరుగా ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12,000ల నుంచి 15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


ఇంకా అలాగే భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో మొత్తం 157 అడ్వైజర్/టెక్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్/టెక్, అదనపు డిప్యూటీ డైరెక్టర్/క్రిప్టో, జాయింట్ డిప్యూటీ డైరెక్టర్/ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్ డైరెక్టర్/ఎగ్జిక్యూటివ్‌, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది.ఈ పోస్టులను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. గ్రూప్‌ ‘ఏ’ గెజిటెడ్‌ ర్యాంక్‌ ఆఫీసర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు డిప్యుటేషన్‌పై 3 నుంచి 5 యేళ్ల వరకు పదవిలో కొనసాగవచ్చు. గరిష్ఠంగా ఏడేళ్ల వరకు పదవీకాలం పొడిగించే అవకాశం ఉంది. స్పెషల్‌ సెక్యురిటీ అలవెన్స్‌ కింద 20 శాతం బేసిక్‌ జీతం చెల్లిస్తారు. దీనితోపాటు యూనిఫాం అలవెన్స్‌ కింద రూ.10,000లు ఇంకా అలాగే చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ కింద రూ.27,000లు అదనంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగినవారు నోటిఫికేషన్‌ విడుదలైన 60 రోజుల్లోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ఆగస్టు 27, 2022వ తేదీన విడుదలైంది. ఇంకా ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: