ఏంటి నువ్వు రిపోర్టర్ వా  ...? ఏ పార్టీ మీది అని జనాలు మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు. అదేంటి విలేఖరా అంటే ఏ పేపర్, ఏ ఛానెల్ అని అడగాలి కదా అంటారా ..? మీరు భలేవారండి. ఇప్పుడు పార్టీల పేపర్లు, ఛానెల్స్ తప్ప నికార్సైన జర్నలిజం ఎక్కడ ఉంది. ఇప్పుడున్న జర్నలిజం అంతా ఏదో ఒక పార్టీని పొగడడానికో, తిట్టడానికో తప్ప, లేక ఎవడో ఒక రాజకీయ నాయకుడినే, ఉద్యోగస్తుడినో బ్లాక్ మెయిల్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి తప్ప నికార్సైన జర్నలిస్టులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పేపర్లు, చానెళ్లు, అన్నే ఇలానే తయారయ్యాయి. అసలు డబ్బున్న మారాజులంతా తమ కులపొడినో, లేక తన బందువుకో భజన చేస్తూ ఎదుటివారిపై మీడియా గొట్టాలతోనో, ఇంకు పెన్నలతోనో ఎదురుదాడి చేయడంతో పాటు అందినకాడికి వెనుకేసుకోవడమే జర్నలిజం అన్నట్టుగా మీడియా వ్యవహారం ముదిరింది. 

 

IHG


ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా ! ఈ రోజు జరిగిన వార్త రెప్ప్పటికో పేపర్ల లో రావడం, అప్పటికే అది కాస్త టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అవ్వడం అప్పటికే ఆ కథనంలో ఉన్న అన్ని కోణాలు రకాల యాంగిల్స్ లో ప్రచారం అవ్వడం అన్నీ జరిగిపోతున్నాయి. అసలే ఇప్పుడున్న జనరేషన్ అంతా ప్రతిదీ మొబైల్ లో తప్ప, ఇంకెక్కడా చూసే అలవాటు లేదు. అందుకే ఇప్పుడు డిజిటల్ జర్నలిజానికే ఆదరణ పెరిగిపోయింది.ఏదైనా వాట్సాప్, పేస్ బుక్ లోనే చక్కెర్లు కొట్టేస్తున్నాయి. ఇక కొంతమంది  జర్నలిస్టుల కారణంగా జర్నలిజం అంటే భ్రస్టుపట్టుకుపోయింది. అసలు ఎక్కడైనా జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికే అవమానంగా ఉంటోంది. 

    

విలేకర్ల దందాకు... వాట్సాప్ ఎడిషన్ల గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ఓ సంఘటన తాజాగా ఖమ్మం జిల్లలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుని టార్గెట్ చేసుకుంటూ ఎటువంటి ఆధారాలు లేని కథనాలను వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ .... సూర్య పత్రిక ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మూర్తి, జిల్లా ఇంచార్జి  సత్యనారాయణ, సత్తుపల్లి రిపోర్టర్ నిమ్మగడ్డ శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. మువ్వా విజయబాబుని టార్గెట్ చేసుకుని సుమారు 30 లక్షల వరకు డిమాండ్ చేస్తూ విజయ్ బాబు ఇంటికి వెళ్లిన వీరంతా విజయబాబు కోసం ఆరా తీయగా ఆయన అందుబాటులో లేకపోవడంతో విజయ్ బాబు భార్యతో గొడవకు దిగారు. అయితే ఆయన ఆ సమయంలో ఏదో గెస్ట్ హౌస్ లో ఉన్నట్టుగా సమాచారం రావడంతో అక్కడకి వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడం వారిని అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. వివిధ సెక్షన్ల కింద వారిని అరెస్ట్ చేశారు.  

 

IHG


అసలు ఈ డిజిటల్ ఎడిషన్లకు పై వార్తకు సంబంధం ఏంటి అంటే ...? ఇక్కడే ఉంది అసలు వార్త. మువ్వా విజయ్ కుమార్ మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని కథనాలను రాసి వాటిని చూపించి ముప్పై లక్షలు ఇస్తే సరే లేకపోతే మీ పరువు గోవిందా అంటూ బ్లాక్ మెయిల్ చేసినారనేది సదరు రిపోర్టార్లపై వస్తున్న ఆరోపణలు. అసలు నేను ఎందుకు మీకు ముప్పై లక్షలు ఇవ్వాలి ..? అంటూ విజయ్ బాబు ప్రశ్నించడంతో ఆ తరువాత 15 లక్షలు ఇవ్వాలి అంటూ కాస్త వెనక్కి తగ్గారు. అయినా వర్కవుట్ కాకపోవడంతో ఐదు లక్షలకు తగ్గారు. చివరకు డబ్బులు డిమాండ్ చేస్తూ పోలీసులకు సదరు మీడియా సిబ్బంది దొరికిపోవడం సంచలనం రేపింది. 


అసలు విలేకర్ల దందా అనేది ప్రతి చోటా ఉండేదే. అసలు పెద్ద పట్టించుకోనక్కర్లేని విషయమే ఎందుకంటే... అరకొర జీతాలు ఇస్తూ.. ఫీల్డ్ లెవల్లో మీ ఇష్టం మీరు ఎలా సొమ్ములు సంపాదించుకుంటారో మేమేమి అడగడం అన్నట్టుగా పత్రికల యజమానస్యలు, మీడియా సంస్థలు పగ్గాలు వదిలెయ్యడంతోనే ఈ పరిస్థితి దాపురించింది అనేది పచ్చి నిజం. ప్రస్తుతం కరోనా దెబ్బ దినపతిరికల మనుగడనే దెబ్బ తీస్తుండడంతో చాల పత్రికలు ప్రింటింగ్ ఆపేసాయి. అయితే డిజిటల్ ఈ -పేపర్లు మాత్రం ఆగకపోవడంతో వాటిని వాట్సాప్ లో పోస్ట్ చేసుకునేందుకు పత్రికల యాజమాన్యాలు అనుమతులు ఇచ్చాయి. అంటే పేపర్ బయట సర్కులేట్ అవ్వకపోయినా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పత్రిక మనుగడ సజీవంగా ఉండేలా చూసుకుంటున్నారు. అంటే పేపర్లు చదివే వారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో సోషల్ మీడియా ప్లేట్ ఫార్మ్ బాగుంది అన్నట్టుగా పత్రికలు మారిపోతున్నాయి... మార్పు కోరుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: