వైసీపీ అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు, నిబ‌ద్ధ‌త‌త‌కు పెట్ట‌ని పేరు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాదిరిగా త‌మ్ముళ్లు ఇష్టానుసారం మాట్టాడితే.. చంద్ర‌బాబు చూసీ చూడ‌న‌ట్టు ఊరుకున్నారు. వారు చేయాల్సిన ప‌నులు చేసే శారు. ఫ‌లితంగా టీడీపీ ఏమైందో అందరికీ తెలిసిందే. కానీ, వైసీపీ ప‌రిస్థితి అలా కాదు.. నేత‌లు ఏం చేయా ల‌న్నా.. పార్టీ పెట్టుకున్న క‌ట్టుబాట్ల మ‌ధ్యే అన్నీ చేయాలి. నేత‌లు ఏం మాట్లాడాల‌న్నా పార్టీలైన్‌లో మాట్లా డాలి. అందుకే పార్టీలో ఇంత‌టి క్ర‌మ‌శిక్ష‌ణ ఉంటోంది. పార్టీలో తేడా చేస్తే.. స‌ద‌రు నేత‌ను వెంట‌నే పిలిచి దారిలో పెట్ట‌డం కూడా వైసీపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌లో భాగ‌మే. ఈ విష‌యంలో ఆగ‌డం-ఆలోచించ‌డం-అవ‌కాశం ఇవ్వ‌డం-బుజ్జ‌గించ‌డం... అనే కాన్సెప్టుల‌కు ఛాన్సే లేదు.

 

అయినా కూడా వైసీపీలో ఒక ఎంపీ జ‌గ‌న్‌కు చెవిలో జోరీగ‌లాగా.. చెప్పులో రాయిమాదిరిగా మారిపోయారు. ఆయ‌నే న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు. ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు, వేసే అడుగులు తీవ్ర వివా దా స్పదంగా ఉంటున్నాయ‌న్న చ‌ర్చ‌లు వైసీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. గెలిచిన వెంట‌నే వెళ్లి బీజేపీ నేత‌ల‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు చెప్పివ‌చ్చారు. ప్ర‌ధాని మోడీని కుటుంబ స‌మేతంగా వెళ్లి భేటీ అయి వ‌చ్చారు. ఈ విష‌యంలో పార్టీకి ఒక్క‌మాట కూడా చెప్ప‌లేదు. ఇక‌, తెలుగు మాధ్య‌మం స్థానంలో ఇంగ్లీషు మీడియాన్ని ప్ర‌వేశ పెట్టాల‌న్న సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంపై పార్ల‌మెంటులో ప్ర‌స్తావించి చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టారు. రాజ‌కీయాల్లో నాకున్న ప‌లుకుబ‌డి ఎక్కువ అని నిరూపించుకునేందుకు కూడా అనేక ప్ర‌య‌త్నాలు చేశారు.

 

దీంతో జ‌గ‌న్ ఒక‌సారి ఇప్ప‌టికే ర‌ఘును నేరుగా అమ‌రావ‌తికి పిలిచి జ‌గ‌న్ సీరియ‌స్‌గా చెప్పార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఇంత చేసినా కూడా ఆయ‌న మార‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత‌గా దుమారం రేపాయి. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ర‌ఘు.. మందు రేట్లు పెంచినందువల్లో... షాపుల సంఖ్య తగ్గించినందువల్లో తాగే వాళ్లు తగ్గుతారని తాను అనుకోవం లేదని కామెంట్ చేశారు. మందు అలవాటు ఉన్నవారు దాని కోసం ఓ రెండు కిలోమీటర్లు ఎక్కువ దూరం పోవడానికి వెనుకాడరని ఎంపీ అన్నారు.  మద్యపాన నిషేధం అమలు చేయదలచ్చుకుంటే.. నేరుగా మద్యపాన నిషేధం పెట్టేయాలని.. ఇలా విడ తల వారీగా పెట్టడం వల్ల ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. 

 

మద్యం అమ్మడమా.. నిషేధించడమా... ఏదో ఒకటి చేయాలని.. ఓవైపు మద్యం అమ్ముతూనే ఇలా రేట్లు పెంచడం, షాపులు తగ్గించడం వల్ల ఉపయోగం ఉంటుందని తాను వ్యక్తిగతంగా అనుకోవడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. నిజానికి పార్టీ మేనిఫెస్టోను ధిక్క‌రించ‌డ‌మే అవుతుంది. ఎందుకంటే.. మేనిఫెస్టోలోనే మ‌ద్య నిషేధంపై విడ‌త‌ల వారీగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచుతామ‌ని జ‌గ‌న్ చెప్పారు. మ‌రి అప్పుడు మాట్లాడ‌ని ర‌ఘు.. ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్య‌ల వెనుక బ‌ల‌మైన వ్య‌వ‌హారం ఏదో న‌డుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న బీజేపీ వైపు చూస్తున్నార‌న్న టాక్ కూడా ఉంది. మ‌రి దీనికి జ‌గ‌న్ ఎలా అడ్డుక‌ట్ట వేస్తారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: