రాజకీయాల్లో ఎంపీలు లంచాలు తీసుకుంటారా.. అంటే.. చెప్పడం కష్టం.. కానీ.. ఎంపీలు అనేక విషయాల్లో లంచాలు తీసుకుంటారని గత ఉదంతాలు చెబుతున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు కూడా కొందరు ఎంపీలు లంచాలు తీసుకున్న విషయం గతంలో పార్లమెంటును కుదిపేసింది కూడా. అలాగే కేంద్రంలో అనేక పనులు చేయించుకునేందుకు... ఎంపీలు లంచాలు తీసుకునే అవకాశాలను తోసుపుచ్చలేం.. అలాగే ఎంపీలకు ఎంపీ లాడ్స్ నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. వాటిని ఆయన ఇష్టం వచ్చినట్టు తన నియోజక వర్గంలో ఖర్చు చేసుకోవచ్చు.


ఇక్కడే సదరు ఎంపీ.. తనకు నచ్చిన వారికి ఆ పనులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ రొటీన్‌ కానీ.. ఓ ఎంపీకి ఓ సీఎంను తిట్టేందుకు ఏకంగా రూ. 8 కోట్ల రూపాయల లంచం ఇచ్చారంటే నమ్మశక్యంగా ఉంటుందా.. మరి ఇది నిజమో కాదో కానీ.. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లో ఈ ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌ను రోజూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేందుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఓ ఛానల్‌ 8 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందట. ఆ డీల్ ప్రకారమే సదరు ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజూ జగన్‌ను తిడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడట.


ఈ గాసిప్‌ గురించి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రజ్యోతి చానల్ అధిపతి రాధాకృష్ణ కూడా తన సంపాదకీయంలో ప్రస్తావించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలుగా ఆయన కొట్టేశారు. అయితే ఇవన్నీ ఏపీ సీఐడి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు అంటున్నారు వైసీపీ నాయకులు. ఇందులో ఏది నిజమో చెప్పడం కష్టం.. ఒకవేళ అదే నిజం అనుకుందామంటే.. ఇంతకీ ఆ ఛానల్ ఏది.. వైసీపీ నేతలు తరచూ టీవీ5, ఏబీఎన్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్లు తరచూ లైవ్ ఇస్తుంటాయని ఆరోపిస్తుంటారు. మరి ఈ ఆరోపణలు వెలుగులోకి తెచ్చింది రాధాకృష్ణ.. కాబట్టి ఆ ఛానల్ బహుశా టీవీ5 కావచ్చేమో అన్న చర్చ కూడా జరుగుతోంది. అయినా కోటీశ్వరుడుగా పేరున్న రఘురామ కేవలం లంచాలకు ఆశపడి జగన్‌ ను తిడతారా.. ఏమో.. అందులో ఆయన ఆగ్రహం కూడా ఉండొచ్చేమో..?


మరింత సమాచారం తెలుసుకోండి: