మళ్లీ అధికారం ఇచ్చే ప్రజలు వైసీపీ ఇవన్నీ సాధిస్తుందని.. అనుకోవడం కూడా సహజం. అయితే.. ప్రజల ఆశలు నెరవేరాలంటే.. ఖచ్చితంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉం టుందనేది అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని వైసీపీ నాయకు లు గుసగుసలాడుతున్నారు. పొరుగున ఉన్న రాష్ట్రాలతో మనకు ఉన్న వివాదాలను పరిష్కరించుకోవా లంటే.. అంతో ఇంతో వారితో సఖ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది.
కానీ, ఇప్పుడు కేంద్రంలోని నరేం ద్ర మోడీ ప్రభుత్వం జగన్‌కు వేస్తున్న పాచికతో పొరుగు రాష్ట్రాలతో జగన్‌కు ఉన్న సంబంధంపై ప్రభావం పడుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎలాగంటే.. పొరుగున కీలకమైన నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా లు ఉన్నాయి. అయితే.. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ.. తెలంగాణ, ఒడిసాలు మనకు అత్యంత కీలకం. ఏపీకి ఏ పనులు జరగాలన్నా... కీలకమైన పోలవరం ప్రాజెక్టును ముందుకు నడిపించాలన్నా..ఈ రెండు రాష్ట్రాల తోనూ పని ఉంది.
ఇక,విభజన హామీల పరిష్కారం కూడా కావాల్సి ఉంది. దీనికి తెలంగాణ సహకారం అత్యంత అవసరం. అయితే.. ఇప్పుడు తెలంగాణ సీఎం జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆయ నకు మద్దతుగా జగన్ ఉంటారని.. భావిస్తున్నారు. కానీ, మోడీ మాత్రం జగన్‌ను తనవైపు తిప్పుకొనేందుకు అనేక వ్యూహాత్మక ప్రకటనలు చేస్తున్నారు. అంతే కాదు.. ఏకంగా సెంటిమెంట్లు కూడా రాజేస్తున్నారు. మరోవైపు.. ఒడిసా తోనూ.. పొలవరం.. కొఠారు గ్రామాల వివాదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతోనూ మనకు సఖ్యత అవసరం. కానీ, ఆ రాష్ట్రం కూడా మోడీని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో మోడీతో అనుసరించే వ్యూహం కనుక అప్రమత్తంగా లేకపోతే.. కష్టమేనని.. వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదే విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు సీఎం జగన్ వేసే ప్రతి అడుగు కూడా కాలకంగా మారుతుందని చెబుతున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలని వైసీపీ నేతల మధ్య గుస గుస వినిపిస్తుండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి