ఆ మధ్య కుప్పంలో సైతం పొత్తు గురించి మాట్లాడిన విషయం తెలిసిందే...కాకపోతే వన్ సైడ్ లవ్ ఉంటే బాగోదు అని చెప్పుకొచ్చారు...అంటే పొత్తుకు తమ సైడ్ నుంచి ముందుకొచ్చిన పవన్ సైడ్ నుంచి ముందుకు రావడం లేదనేది బాబు కాన్సెప్ట్..అయితే తాజాగా పవన్ సైతం..పొత్తు విషయంలో ఒక అడుగు ముందుకేసిన విషయం తెలిసిందే...వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చే ప్రసక్తి లేదని చెప్పి పొత్తు గురించి హింట్ ఇచ్చారు.
అంటే దీంతో టీడీపీ-జనసేనల పొత్తు దాదాపు ఖాయమనే తెలుస్తోంది..కాకపోతే పొత్తు విషయంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి..కొందరేమో పొత్తుకు ఓకే అంటుంటే...మరికొందరు ఇంకో పార్టీ మీద ఆధారపడి గెలవాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. పైగా జనసేన ఏమో పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది..ఇలాంటి డిమాండ్ల నేపథ్యంలో పొత్తు పెద్దగా అవసరం లేదని, ఏదైనా సింగిల్‌గానే తలపడదామని చెబుతున్నారు.
పైగా వైసీపీ నేతలు...అన్నీ పార్టీలు కలిసి జగన్‌ని టార్గెట్ చేసాయనే రాజకీయ కోణాన్ని బయటపెట్టి..ఏదో సెంటిమెంట్‌తో మళ్ళీ బయటపడాలని చూస్తున్నారు. అంటే ఎందరు కలిసిన జగన్ సింగిల్ గానే ఫైట్ చేస్తారనే కోణాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇలా చేస్తే వైసీపీకే లాభమని, కాబట్టి మనం కూడా సింగిల్ గానే బరిలో దిగుదామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి..మరి చూడాలి చివరికి పొత్తు ఉంటుందో లేదో?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి