బాగానే ఉంది.. కానీ ఈ సభాసంఘం ఏర్పాటుతో వైసీపీ సర్కారు ఏం సాధిస్తుందన్నది అనుమానమే.. అసలు సభా సంఘం ఏర్పాటు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇప్పుడు అధికారం వైసీపీ చేతిలోనే ఉంది. దీనిపై విచారణ చేయంచుకోవచ్చు. అప్పట్లో చంద్రబాబు హయాంలో పెగాసస్ కొన్నారా లేదా అన్నది అధికారంలో ఉన్నవారికి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.. కోట్ల రూపాయల్లో చెల్లింపులు అవసరం కాబట్టి అందుకు సంబంధించిన చెల్లింపుల రికార్డులు ప్రభుత్వం వద్ద ఉంటాయి. దీనికి వేరే ప్రత్యేకంగా సభాసంఘం అంటూ అవసరమే లేదు.
పోనీ.. ఈ సభాసంఘానికి ఏమైనా న్యాయ అధికారాలు ఉంటాయా.. అప్పట్లో చంద్రబాబు హయాంలో పెగాసస్ కొన్నారని తేలితే.. ఈ సభా సంఘం ఏం చేస్తుంది... తీర్పు ఇవ్వగలదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు తాము కొనలేదని అప్పటి విజిలెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.. తెలుగు దేశం కూడా ఏం విచారణ చేస్తారో చేసుకోండి అని ధైర్యంగా అంటోంది.
మొత్తానికి ఈ వ్యవహారంలో సాధించేదేమీ కనిపించడం లేదు. కాకపోతే.. విచారణ పేరుతో అప్పటి ముఖ్య పదవుల్లో ఉన్నవారిని సభా సంఘం విచారణ పేరుతో పిలిపిస్తుంది. ఆ సమయలో మీడియాలో హడావిడి ఉంటుంది. ఓ ఏడాది పాటు ఈ హడావిడి మీడియాలో నడవటానికి తప్ప ఈ సభా సంఘం సాధించేదేమీ ఉండదు. అయితే.. వైసీపీ ప్రభుత్వానికి కూడా అదే కావాలేమో మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి