ఇప్పటి వరకు ఏ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు కాలేదు ఇది ఆయన నిజాయతీకి నిదర్శనం అని టీడీపీ నేతలు మాట్లాడుతుంటారు. కానీ చంద్రబాబు వ్యవస్థలను చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. అందువల్లే ఇప్పటి వరకు ఆయన అరెస్టు కాలేదు అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఏది ఏమైనా చంద్రబాబుకు ఏ రాజకీయ నేతకు లేనటువంటి న్యాయ నిపుణుల బృందం ఉందని పలువురు అభిప్రాయపడుతుంటారు.


ఇప్పుడు చంద్రబాబు శిక్షణ నైపుణ్య అభివృద్ధి కేసులో అరెస్టయ్యారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం..  తొలి 15 రోజుల్లో నిందితుడిని కస్టడీకి తీసుకోవాలి. తప్పని పరిస్థితులు మినహాయించి ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అనుమతి లేదు.  ఈ అంశాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు తరఫు  న్యాయవాదులు 17ఏ ప్రకారం రిమాండ్ కొట్టివేయాలి అని హైకోర్టు లో పిటిషన్ దాఖలు  చేశారు.


హైకోర్టు లో వాదనలు జరిగే సమయంలో మళ్లీ వాయిదా అడిగారు. చంద్రబాబుపై క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది.  కొట్టేసే పిటిషన్ సందర్భంలో ఈ వాదనలు అనవసరం. కింది కోర్టులు మళ్లీ ఆయన్ను కస్టడీకి అనుమతి ఇస్తారు. దానిని ఆపేయండి అని వాదనలు వినిపించారు. న్యాయమూర్తి కూడా సెప్టెంబరు 18 వరకు కస్టడీ పిటిషన్ పక్కన పెట్టాలని కింది కోర్టుకి సూచించారు.


మళ్లీ దిగువ కోర్టు దగ్గర.. కేసు ఇంకా కొట్టివేయలేదు. మీరు కస్టడీ వాదనలు ఎలా వింటారు.. మేం బెయిల్ పిటిషన్ కూడా వేశాం అని వాదించారు. తద్వారా హైకోర్టు తీర్పు వచ్చేదాకా కస్టడీని ఆపారు. అప్పటికే చంద్రబాబు రిమాండ్ 13 రోజులు అయిపోయింది. దీంతో ఆయన్ను రెండు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కస్టడీ కూడా లేకుండా చేయాలనే అతని తరఫు లాయర్లు ప్రయత్నం చేశారు. కస్టడీ పెంచకపోతే సీఐడీ దగ్గర ఆధారాలను చంద్రబాబు అంగీకరించరు. అప్పుడు ఆయన ఈ కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: