అయితే ఈ విషయాన్ని మీడియాలో రాకుండా జాగ్రత్త పడిన కేసీఆర్ సోషల్ మీడియాలో మాత్రం అడ్డుకోలేకపోయారు. ఇవాళ దీనిపై కుట్ర కోణం ఉందంటూ ఇంజినీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఇప్పటికే భూపాల పల్లి ఎస్పీ మావోల చర్య కాదని తేల్చి చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఫిర్యాదు చేయడం.. దీనిలో కుట్ర కోణం ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు మీడియాలో ప్రధాన వార్తాంశం అయింది.
అయితే నాణ్యతా లోపం కారణంగానే బ్యారేజీ కుంగిపోయిందని రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్రం దాని పరిధిలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణుల బృందాన్ని తనిఖీ కోసం పంపింది. క్షేత్ర స్థాయిలో ఈ బృందం పరిశీలన చేసింది. కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
ఘటన జరిగిన 24 గంటల తర్వాత మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రవి కాంత్ ఫిర్యాదు చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాత వెళ్లి చూస్తే 21 నంబరు పిల్లరు కుంగిపోయినట్లు తేలిందని ఏఈఈ పేర్కొన్నారు. ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఈ ఫిర్యాదు చేయించింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో చిక్కులు వస్తాయనే ఇలా చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి