అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ విషయాన్ని సర్వేయర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ సర్వే నంబర్ 1351 లో 1.55 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఇదే పంచాయతీకి కి చెందిన వెంకట నారయణ రెడ్డి, రమేశ్ రెడ్డి మరో వర్గమైన అనిల్ రెడ్డి, సునిల్ రెడ్డిల మధ్య భూ వివాదం కొనసాగుతోంది.
ఈ విషయమై వెంకటనారాయణ రెడ్డి కోర్టులో దావా వేశారు. ఈ భూమిలో తమకు వాటా ఉందని..ఎంజైమెంట్ ధ్రువపత్రం ఇవ్వాలని అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మార్వో ధనుంజయిలు, సర్వేయర్ రెడ్డప్పను విచారించాలని ఆదేశించారు. పూర్వాపరాలను తెలుసుకున్న సర్వేయర్ కోర్టు వివాదంలో ఉన్న భూమికి ధ్రుప పత్రాలు ఇవ్వలేమని తెలిపారు. దీంతో దుర్భాషలాడుతూ ఆయనపై దాడికి దిగారు. ఈ సంఘటనను కార్యాలయ సిబ్బంది వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఇరు వర్గాల వారు వైసీపీ నేతలా లేక ఒక వర్గమేనా అనేది తెలియరాలేదు. ఏది ఏమైనా తప్పు చేసి వారికి శిక్ష పడాలి. వారు ఏ పార్టీ అయినా. తనకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై వైసీపీ నేతలు దాడులు చేసిన విషయం తెలిసిందే. వీటిని వైసీపీ అడ్డుకోకపోతే ఆ పార్టీ నష్టపోయే ప్రమాదముంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి