రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందని బీసీ ఓట్లు కొన్ని ఇతర పార్టీలకు తరలి వెళ్లాయి. ఇప్పుడు ఆ బీసీ ఓటు బ్యాంకుపై కన్నేసింది బీజేపీ. అందుకే బీసీ అభ్యర్థే సీఎం అనే నినాదాన్ని తీసుకు వచ్చింది. అయితే 2014లోనే బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించి టీడీపీ ఎన్నికలకు వెళ్లింది.
ఆ పార్టీకి చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చినా.. ఆ తర్వాత కృష్ణయ్యకు టీడీపీ శాసనసభ పక్ష నేత పదవి కూడా ఇవ్వలేదు. ఆయన్ను పక్కన పెట్టింది. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ ని టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించినా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలకు దూరంగా ఉంటుంది. దీంతో ఆయన రాజీనామా చేశారు. తాజాగా టీడీపీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహాటంగా చెప్పకపోయినా ఈ రెండు పార్టీల మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని రాజకీయ వర్గాలు చర్చించకుంటున్నాయి.
మరోవైపు ఏపీలో టీడీపీకి మాదిగ సామాజిక వర్గాల్లో బలమైన పట్టుంది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుపై కూడా బీజేపీ కన్నేసినట్లు కనిపిస్తోంది. ఇలా తెలంగాణలో బీసీలను, ఏపీలో మాదిగలను బీజేపీ వ్యూహాత్మకంగా తమ వైపు తిప్పుకుంటుంది. ఇది కేసీఆర్ కు, చంద్రబాబుకి కోలుకోలేని దెబ్బనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి