జగన్ వణికిపోతున్నాడు. 20 సీట్లు వస్తాయేమోనని, 30 వస్తాయోనని భయపడుతున్నాడని ఎల్లో మీడియా ప్రచారం చేసేస్తుంది. అయితే మంత్రులకే టికెట్లు ఇవ్వడం లేదని చాలా మంది అంటున్నారని దాదాపు మంత్రుల్లో కేవలం 11 మందికే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని మిగతా వారిని లోక్ సభకు పంపించే ఏర్పాటు చేస్తున్నారని చెబుతుంది. అయితే టీడీపీ, జనసేన ఎవరికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.


జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు. ఎన్ని ఇవ్వరు. ఏయే స్థానాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏయే స్థానాల్లో జనసేన నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. పోనీ పొత్తు లేకుండా పోటీ చేస్తారా ఇలా చాలా విషయాల గురించి మాట్లాడాల్సిన ఎల్లో మీడియా మాత్రం అస్సలు వాటి గురించి చర్చించడం లేదు. కానీ వైసీపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను మాత్రం కథనాల రూపంలో చర్చకు తీసుకువస్తుంది.


చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని మరి కొంతమందిని ఎంపీకి పోటీ చేయిస్తారని చెబుతున్నారు. విడుదల రజిని, ఉషశ్రీ, దర్మాన ప్రసాదా రావు, గుడి వాడ అమర్ నాథ్, జోగి రమేశ్ ఎంపీలుగా పోటీ చేయనున్నారని తెలుస్తుంది. ఉషశ్రీని హిందుపురం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు, స్పీకర్ తమ్మినేని శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ ఆరోగ్య కారణాల రీత్యా రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.


సాలూరు లో రాజన్న దొరకు టికెట్ దొరకకుండా ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో పోటీ చేయాలని చూస్తుండగా ఆయనకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నట్లు, రోజాకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. ఇందులో ఎన్ని వాస్తవాలో, ఎన్ని అబద్ధాలో వారికే తెలియాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: