అయితే చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ లాంటి దేశాల నుంచి మాదక ద్రవ్యాలు ఎక్కువగా మాల్దీవులు అక్కడికి వస్తున్నాయి. మాల్దీవులకు వచ్చే పర్యాటకులతో ఆ దేశం ప్రస్తుతం ఎక్కువగా ఆర్థికంగా బలంగా తయారైంది. కానీ డ్రగ్స్ వాడకం, సెక్స్ వల్ యాక్టివిటీస్ లే కాకుండా అనేక రకాలు ఇల్లీగల్ దందాలు నడిపించే కేంద్రంగా అది తయారైంది. ఇలా ప్రతి విషయంలో మాల్దీవులను వాడుకుంటున్నారు. ఆ దేశ ప్రధాన వనరు పర్యాటక రంగం. ఇక్కడికి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఎంతో మంది వచ్చి ఎంజాయ్ చేసి పోతుంటారు. ఇలా ఎంజాయ్ చేసే సమయంలో వారు విచ్చలవిడి తనానికి అలవాటు పడి పోతారు.
అయితే ఇండియా అనేక రకాల టూరిజం ప్లేస్ లు ఉన్నాయి. వాటిని డెవలప్ చేయడంలో ప్రభుత్వం వెనకబడి ఉంది. ఇలా వెనకబాటు తనం వల్ల అనేక రకాలుగా భారత సొమ్ము మాల్దీవులకు చేరుతుంది. దేశానికే చెందిన అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేస్తే అక్కడ పర్యాటక రంగం ఎంతో వృద్దిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా అనేక రకాలుగా దేశం వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి.
కానీ దేశంలో ఇల్లీగల్ సెక్స్ వల్ యాక్టివిటీస్ చెల్లవు. కాబట్టి అందరూ అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ సంపాదించిన డబ్బును మాల్దీవుల్లో ఖర్చుపెట్టి ఆ దేశానికి సాయం చేస్తున్నారు. ఇలాంటి వి జరగుకుండా దేశంలో కూడా టూరిజం స్పాట్ లు పెంచాలి. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేయాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి