పుటపర్తిలో 100 సంవత్సరాలక్రితం ఈశ్వరాంబ కు జన్మించిన బాలుడు తన 14వ ఏట తాను సత్యసాయి బాబా ని అని ప్రకటించుకున్నప్పుడు ఆ బాలుడు ఒక ఆధ్యాత్మిక ప్రపంచానికి మహారాజు గా మారి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా భక్తుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటానని ఈశ్వరాంబ కానీ ఆనాటి పుట్టపర్తి లోని ప్రజలు కానీ ఊహించి ఉండరు.

ఒకవ్యక్తి తనకు తానుగా భగవంతుడుని అని ప్రకటించుకున్న తరువాత ఆయన పై ఎన్నో అపవాదులు విమర్శలు వస్తాయి. వీటన్నిటిని తట్టుకుని సత్యసాయి భగవంతుడు గా మారారు. తన చిన్న వయస్సు నుండే అసాధారణమైన దయ మరియు సేవా భావంతో అలానాటి నుండి ఈనాటి వరకు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని మహోన్నత వ్యక్తిగా సత్యసాయి మారారు. ప్రేమ సత్యం ధర్మం శాంతి అహింస” అనే మూల సూత్రాలు ఆయన ఉపన్యాసాలలో కనిపించడంతో దేశ ప్రధానులు నుండి అతి సామాన్యుడి వరకు ఎందరో సత్యసాయి భక్తులుగా మారారు.

సత్యసాయి సేవాసమితి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు సేవా భావంతో సేవాకార్యక్రమాలు చేస్తూ ఆకార్యక్రమాలలోనే భగవంతుడుని చూస్తూ ఉంటారు. మానవసేవయే మాధవ సేవ అంటూ భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాటలకు సందేశంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో సత్యసాయి సేవా ట్రస్టు సేవలు అందిస్తోంది.

ఈ ట్రస్టులో 7లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నారు అంటే సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని ప్రపంచం అంతా పంచుతూ ప్రపంచం అంతా ఒక ప్రేమ మయంగా మారాలని కోరుకున్న బాబా కలలను  నిజం చేయడానికి తమవంతు ప్రయత్నం అందరు కొనసాగిస్తూనే ఉన్నారు. పుట్టపర్తి లో ఉచిత వైద్య సేవలు అందించే “సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్” ఇప్పటివరకు 60 లక్షల మందికి ఉచిత వైద్యం అందించారు అంటే సత్యసాయి ట్రస్టు చేసిన సేవా కార్యక్రమాల స్థాయి ఎలాంటిదో తెలుస్తుంది. పేదలకు స్వచ్ఛమైన నీరు అందించే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ విద్యార్థులకు ఉచిత నైతికతతో కూడిన విద్య అందించే సత్యసాయి విద్యా సంస్థలుఇలా ఎన్నో సత్యసాయి సేవా సంస్థల కీర్తి కిరాటాలు. సత్యసాయి  బాబా శివ సాన్నిధ్యం పొందిన తరువాత కూడ పుట్టపర్తి లోని ప్రశాంత నిలయం ఆధ్యాత్మిక కేంద్రంగా మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించే మహత్తర కేంద్రముగా వెలుగొందుతోంది. “ప్రేమతో జీవించండి సేవతో నిండిన జీవితం గడపండి” అన్న సత్యసాయి మాటలు ఈతరానికి ఎంతో అవసరం..  

మరింత సమాచారం తెలుసుకోండి: