తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఉద్యోగ నియామకాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల పాలన పూర్తయ్యే నాటికి మొత్తం లక్ష ఉద్యోగాల భరతీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఈ హామీలను నమ్ముతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వల్ల యువతలో అపనమ్మిక పెరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపిన నిబద్ధత గురించి ముఖ్యమంత్రి వివరించారు. దేశంలో రైతులకు అత్యధికంగా వరి కొనుగోళ్లు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని దండగగా కాకుండా పండుగగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు.

రుణమాఫీ నుంచి కొనుగోళ్లు వరకు అన్ని రంగాల్లో రైతులకు మద్దతు అందిస్తున్నామని వివరించారు. ఇటీవలి కాలంలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగి దేశంలో మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.మహిళల సాధికారతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో వందలాది బస్సులను ఆడబిడ్డలు యజమానులుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని తెలిపారు. స్వయం సహాయక బృందాలకు బస్సులు కేటాయించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఈ చర్యలు మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.పేదల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కూడా గణనీయం.

3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు గృహాలు అందనున్నాయని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: