ఈ విద్యా సంవత్సరంలో 49 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కాలేజీలు మూతపడనున్నాయి. మరో రెండు ఇంజినీరింగ్ కాలేజీలపై జేఎన్టీయూ కాకినాడ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. వీటికి అనుబంధ గుర్తింపు నిలిపివేస్తే మొత్తం మూతపడే కాలేజీల సంఖ్య 53కు చేరుతుంది. ఇవి కాకుండా మరో 62 ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లకు కోత విధించారు.