హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది గూగుల్. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతుంది.ఈ ఇంటర్న్‌షిప్ అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 11 చివరి తేదీ. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారు ఇండియాలోనే ఉండాలి. ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.