ఏపిలో స్కూళ్లల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కారంచేడు ఎంపీయూపీ స్కూల్లో ఓ టీచర్‌కు, తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఇక టంగుటూరు మండలం మర్లపాడు జడ్పీ హైస్కూల్లో ఇద్దరికి, అర్థవీడు మండలం పాపినేనిపాలెం జడ్పీ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థులకు కరోనా వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మళ్లీ స్కూల్స్ మూతపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..