'దోస్త్' స్పెషల్ డ్రైవ్ తేదీలను ప్రకటించిన ఏపి సర్కార్..ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను శుక్రవారం నుంచి డిసెంబరు-2వరకు చేసుకోవచ్చునని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు..అందులో ఎంపికైనవా జాబితాను డిసెంబరు-4న ప్రకటిస్తారు. ఇంతవరకు సీటుకు దరఖాస్తు చేయనివారితోపాటు దరఖాస్తు చేసినా సీటు దక్కనివారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నా వెబ్ ఆప్షన్ ఇవ్వనివారు, సీటు ఖరారైనా కాలేజీలో చేరనివారు తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు