తెలంగాణలో ప్రభుత్వ శాఖలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు వివిధ శాఖల్లో 50 వేల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది..విద్యాశాఖలో టీచర్ పోస్టుల ఖాళీలు 8,000 ఉన్నాయని పేర్కొంటూ ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, పీఈటీలతోపాటు మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టుల వివరాలు కూడా ఉన్నట్టు వెల్లడైంది..