ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు, కొత్త జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైతం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టింది.. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి.. ఈ జాబ్ నియామకాలను చేపట్టే ఆలోచనలో బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తుంది.