యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణ తేదీలు విడుదలయ్యాయి. ఈ తేదీల పై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ మంగళవారం స్పష్టత ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తుందని ఫోఖ్రియాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం సబ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు దేశవ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్రం ప్రతీ సంవత్సరం యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహిస్తోంది.రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చ్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఫీజును మాత్రం మార్చి 3 వరకు చెల్లించే అవకాశం కల్పించారు.