అమెరికా లాంటి దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలి అని భావించే వారికి చక్కటి అవకాశం అందిస్తున్నారు.అక్కడ మన వాళ్లకు కావలసిన అన్నీ మార్గదర్శకాలను అందిస్తున్నారు. ఇండో- అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంపూర్ణ సహకారం అందిస్తుందని సంస్థ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు సూరపనేని చెప్పారు.ఆ సంస్థ అమెరికన్ కాన్సులేట్, యూఎస్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ తో సంయుక్తంగా అమెరికాలో ఉన్నత విద్యపై అవగాహన కల్పించేందుకు మంగళవారం వెబినార్ నిర్వహించింది.