ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ ఊరట కలిగించే వార్తను అందించింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సిం గ్ సిబ్బంది పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది.రెగ్యులర్ ఉద్యోగులతోపాటు తాత్కాలిక ఉద్యోగులకు కూడా గౌరవప్రదంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరికోసం మొదటి వేతన సంఘం చేసిన సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వం లో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ దీనిపై తీవ్రంగా సమరాలోచనలు చేస్తుంది.