సాక్షమ్ పోర్టల్ కార్మికుల్లోని నైపుణ్య స్థాయిని గుర్తించిన తరువాత, వారికి స్కిల్ కార్డులు ఇస్తుంది. వాటి ద్వారా తమ సమీప ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఇలతో కార్మికులు సులభంగా ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది.దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఇల అవసరాలకు అనుగుణంగా సాక్షమ్ జాబ్ పోర్టల్ కార్మికులకు స్కిల్స్ మ్యాపింగ్‌ను నిర్వహిస్తుంది. దీనితో ఎలాంటి ఒత్తిడి లేకుండా కార్మికులకు కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి.దేశం అంతటా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పోర్టల్ నేరుగా కార్మికులను ఎంఎస్ఎంఇలతో అనుసంధానం చేస్తుంది.ఇకపోతే పోర్టల్ వల్ల ఇప్పటికే అనేక స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తన్నాయని అధికారులు వెల్లడించారు..