తెలంగాణ సర్కార్ యువత భవిష్యత్ కోసం కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. హైదరాబాద్లోని ఈసీఐఎల్ యూనిట్లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది గడువున్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెంచేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.