డిగ్రీ పాసైన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియా గవర్నమెంట్ కు చెందిన జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 44 పోస్ట్‌లు ఉన్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది.ఫైనాన్స్, జనరల్, లీగల్, ఇన్స్యూరెన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 29 చివరి తేదీ.