ఇంజినీరింగ్ కోర్సులో చేరని, కోర్సును మధ్యలో వదిలేసి వెళ్లే విద్యార్థుల రుసుమును వాపసు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలలన్నింటినీ ఆదేశించింది. ఇటువంటి విద్యార్థుల టీసీలను కళాశాలలు తమ వద్దే నిలిపి ఉంచుకోకూడదని కూడా ఆదేశించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తమకు రుసుము వాపస్ చేయడం లేదంటూ కోర్సును వీడి వెళ్లిపోయే విద్యార్థుల నుంచి కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.


Image result for ingeneering students

ఖాళీ అయిన సీటును ప్రవేశాల చివరి తేదీలోపు మరో విద్యార్థితో భర్తీ చేస్తే ఇంజినీరింగ్ విద్యాసంస్థలు రుసుములు వాపసు చేయడం తప్పనిసరి చేయాలని ఏఐసీటీఈని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇటువంటి సందర్భాల్లో ప్రాసెసింగ్ రుసుము గరిష్ఠంగా రూ.వెయ్యి వరకు విద్యార్థులపై వేయవచ్చని, ఉన్న కాలానికి నెలవారీ రుసుమును, వసతిగృహం కిరాయిని కూడా వసూలు చేసుకోవ్చని ఒక అధికారి వెల్లడించారు. వెళ్లిపోయే విద్యార్థి దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోగా రుసుము, ధ్రువీకరణ పత్రాల వాపసు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించని పక్షంలో విద్యార్థి నుంచి వసూలు చేసిన మొత్తం రుసుముపై రెట్టింపు వరకు జరిమానాను సంబంధిత ఇంజీనీరింగ్ కళాశాల నుంచి ఏఐసీటీఈ రాబట్టవచ్చు. ఈ నిబంధనలను పదే పదే ఉల్లంఘింస్తుంటే అరుదైన సందర్భాల్లో సంబంధిత కోర్సుకు ఇచ్చిన ఆమోదాన్ని ఏఐసీటీఈ ఉపసంహరించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: