కరోనా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగాలు చేయడానికి కానీ , కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి కానీ కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో తీవ్ర ఆర్ధిక నష్టం వాటిల్లింది.అయిన కొన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అందులో టీసీఎస్ కూడా ఒకటి..టీసీఎస్ 40 వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 2021 కూడా అంత మందిని తీసుకుంటుందని అంచనాలు వేస్తున్నారు.


సంవత్సరంలో నేషనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ నాలుగు సార్లు అయిందని ఎక్కువ మందిని తీసుకుంటున్నామని అన్నారు. అలానే ఆయన ఎక్కువమందిని ఇప్పుడు కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు.రానున్న సంవత్సరం లో టెక్నాలజీ టైప్లో మరింత ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించారు. టిసిఎస్ కాన్స్ టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 4.2 శాతం జనవరి మార్చ్ 2021లో పెరిగిందన్నారు. ఈ ఏడాది టీసీఎస్‌ నికర లాభం రూ.32,340 కోట్ల నుంచి రూ. 33,388 కోట్లకు బలపడింది.


భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ఇన్ఫోసిస్ 26,000 మందిని కళాశాల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పింది. ఆర్ధిక సంవత్సరం 2021 కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయని రావ్ అన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ డిజిటలైజేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని మెయింటెన్ చేశామని డిజిటల్ బిజినెస్ 50% కంటే ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. 12 మధ్యంతర డివిడెండ్‌ తో కలిపి, ఎఫ్‌వై 21 కోసం మొత్తం డివిడెండ్ రూ .27 గా వుంది. ఇది ఎఫ్వై 20 కన్నా 54% పెరుగుదల వుంది. దీనితో కంపెనీ మొత్తం డివిడెండ్‌ను రూ .11,500 కోట్లు ప్రకటించింది.. ఈ రెండు కంపెనీల వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.గతంలో అనేక కంపెనీలు ఉద్యోగాల కొలువుల కోసం పోటీ పడ్డాయి.. ఈ ఏడాది కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: