అమెరికా లాంటి దేశాలు కూడా కరోనా దెబ్బకు అల్లాడి పోతున్నాయి. ఈ దెబ్బతోనే ఆ దేశం చైనా, తాలిబన్ లాంటి వారి ముందు కూడా మోకరిల్లాల్సి వచ్చింది. ఎప్పుడు పెద్దన్న మాదిరి హడావుడి చేసే ఆ దేశం కరోనా పరిణామాల నేపథ్యంలో క్వారంటైన్ మాదిరి ఉండిపోతుంది. హడావుడి లేకుండా బ్రతికేస్తుంది. ఇక కరోనా సమయంలో కొందరు నిర్ణయాలు ఆచితూచి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రతికిపోయారు, మిగిలిన వారు మాత్రం తెలివి తక్కువగా తీసుకున్న నిర్ణయాలకు ప్రస్తుతం మరో సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు. కరోనా సమయంలో అతిపెద్ద సమస్య ఉద్యోగులను పట్టించుకోకుండా భారం అని చాలా సంస్థలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేశాయి. ఇదే వాళ్ళను ఇప్పుడు పెద్ద ఇబ్బందికి గురిచేస్తుంది. అప్పట్లో తమపట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన సంస్థలను కూడా చాలా ఉద్యోగ సంఘాలు దూరంగా పెడుతుండటంతో ఆయా సంస్థలలో చేరే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది.

దీనితో ఆయా సంస్థలలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఆ కొరతను తీర్చుకోవడానికి, తాము చేసిన తప్పుడు నిర్ణయానికి ఫలితంగా రెట్టింపు జీతాలు ఇస్తామని చెప్పినప్పటికీ ఉద్యోగులు వచ్చేందుకు సిద్దపడటం లేదు. దానితో ప్రస్తుతం అమెరికాలో పలు సంస్థలు ఈ తరహా సంక్షోభాన్ని తీవ్రంగానే ఎదుర్కొంటున్నాయి. దేశంలో ఎన్నడూ లేని నిరుద్యోగసమస్య ఉన్నప్పటికీ, మరోపక్క ఉద్యోగాలు కూడా భారీగానే ఉన్నాయి. కానీ అందులో చేరే వారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. దీనితో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నారు.

అప్పట్లో దాదాపుగా 44 లక్షల మంది ఒక్కసారిగా రాజీనామా చేసేశారు. వాళ్ళు మాత్రం మళ్ళీ తమ ఉద్యోగాలలో చేరేందుకు సంసిద్ధంగా లేరట. ఇక దేశంలో ప్రస్తుతం 1.4 కోట్ల ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలో పండుగలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ అవగానే సంస్థలు ఉద్యోగులను బ్రతిమిలాడో బామాలో ఎక్కువ మొత్తంలో బోనస్ లవంటివి ప్రకటించో ఉద్యోగాలను భర్తీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రభావం బాగా కనిపిస్తున్న వాటిలో రెస్టారెంట్లు, హోటళ్లు, రిటైల్, వ్యక్తిగత సేవా విభాగం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది ఇతర దేశాలకు శుభవార్త అని చెప్పవచ్చు. వీసా ఉంటె ఉద్యోగం దొరికే అవకాశం చాలా ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: