ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు ?

ఇండియన్ రైల్వేస్ : ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాల  భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది.ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌తో పాటు రైల్వే జోన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ నోటిఫికేషన్స్ జారీ చేస్తుంటాయి. అప్పుడప్పుడు ఐటీఐ అర్హతతో అప్రెంటీస్ పోస్టులు, స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీ కోసం వేరుగా నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి.ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3115 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈస్టర్న్ రైల్వే. వేర్వేరు రైల్వే డివిజన్లలో ఈ పోస్టులున్నాయి.మొత్తం 7 డివిజన్లు, వర్క్‌షాప్స్‌లో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 చివరి తేదీ. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్‌లో విడుదలవుతుంది. 


అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.మొత్తం 3115 ఖాళీలు ఉండగా అందులో హౌరా డివిజన్- 659, లిలువా వర్క్‌షాప్- 612, సీల్దాహ్ డివిజన్- 440, కంచ్రపార వర్క్‌షాప్- 187, మాల్దా డివిజన్- 138, అసన్సోల్ వర్క్‌షాప్- 412, జమాల్‌పూర్ వర్క్‌షాప్- 667 పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక విధానం చూస్తే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు  https://rrcrecruit.co.in/eraprt2223rrc/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి. కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేస్కోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: