సర్కారీ స్కూళ్లలో చదువుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి గిప్ట్ ఇచ్చింది. జిల్లాలో స్థాయిలోనే కాకుండా నియోజకవర్గంలో మొదటి స్థానంలో వస్తే రూ. 15 వేల క్యాష్ బహుమతి, రెండో స్థానానికి రూ. 10 వేలు, మూడో స్థానానికి రూ. 5 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
నాడు నేడు తర్వాత ఆంధ్ర ప్రదేశ్ బడుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కార్పొరేట్ తరహా విద్యా విధానం, జగనన్న విద్యా దీవెన, స్కూళ్ల డెవలప్ మెంట్ తో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను అందజేస్తోంది.


కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా మలిచి పేద వారికి అందకుండా చేయాలని ఎన్నో శక్తులు అడ్డుకుంటూనే ఉన్నాయి. కార్పొరేట్ విద్యలో మేం చదువు మిగతా వారి కంటే బాగా చెబుతాం. వారి కంటే మెరుగ్గా తయారు చేస్తాం. వారిని ఎన్నో రకాలుగా మార్చుతాం. ఇలా చాలా రకాలుగా చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విపరీతంగా డబ్బులు లాగేస్తుంటారు. వారిని పీల్చి పిప్పి చేస్తుంటారు. పిల్లవాడి చదువు కోసం తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పరిస్థితి తెస్తారు. ఎంతటి దారుణ స్థితిలో ఉన్నా కూడా ఫీజు విషయంలో కఠినంగా ఉంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటారు.


సంపాదించే సంపాదంతా కార్పొరేట్ స్కూళ్లకు, కార్పొరేట్ వైద్యానికే మధ్య తరగతి వారు పెట్టేస్తున్నారు. ప్రజలకు నామమాత్రపు ధరల్లో ఫీజులు ఉంటే ప్రైవేటు వైపు చదివించడానికి తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పథకం ద్వారా తీసుకొచ్చిన మార్పులతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.


రాష్ట్రంలో పదో తరగతిలో  28 మంది టాప్ స్టూడెంట్లు ఉంటే 26 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే టాప్ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కానీ ఎక్కడా కూడా 26 మంది టాప్ వచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి యాడ్స్ ఇవ్వలేదు. ప్రచారం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: