ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  ఇక ప్రతిరోజు ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా వింతైన ఘటన జరిగింది అంటే చాలు దానిని ఇంటర్నెట్లో పెట్టేయడం లాంటివి చేస్తూ ఉన్నారు జనాలు. ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చిన విషయాలను తెలుసుకునేందుకు ఇక నేటిజన్స్ అందరు కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. కవల పిల్లల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం నిమిషాల గ్యాప్ లోనే ఒకేసారి పుట్టే శిశువులను కవల పిల్లలు అంటారు. అయితే ఇలా కవల పిల్లలుగా పుట్టిన వారు దాదాపుగా ఒకే రకమైన రూపురేఖలు కలిగి ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ట్విన్స్ ని కొత్తగా చూసినవారు ఎవరి పేరు ఏంటి అన్నది కూడా గుర్తుపట్టడం చాలా కష్టం. అలా ఒకరికి ఒకరు జిరాక్స్ కాపీ అన్నట్లుగానే రూపు రేఖలు కలిగి ఉంటారు. అయితే ఇలా ఇప్పటివరకు కవల పిల్లలు ఒకే రూపురేఖలను కలిగి ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు.



 కానీ ఇక్కడ ట్విన్స్ అక్కచెల్లెళ్లకు మాత్రం రూపురేఖల్లో మాత్రమే కాదు పరీక్షల్లో సాధించిన మార్కులు కూడా ఒకేలాగ ఉన్నాయి. కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హసన్ కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బందచంద్ర ఇటీవలే విడుదలైన ఇంటర్ పలితాలలో సమాన మార్కులు సాధించారు. 600 మార్కులకు గాను 571 మార్కులు వచ్చాయి. ఇద్దరికీ ఒక్క మార్కు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా రావడం గమనార్హం. ఇక్కడ విశేషం ఏంటంటే రెండేళ్ల క్రిందట ఈ ట్విన్స్ రాసిన పదో తరగతి పరీక్షల్లో కూడా ఒకే రకమైన మార్కులు వచ్చాయి. 625 మార్కులకు గాను 600 మార్కులు సాధించారు ఈ కవల అక్క చెల్లెళ్లు. అయితే ఇది పూర్తిగా యాదృచ్ఛికమని సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే తెలియదు అంటూ చెబుతున్నారు ఈ ట్విన్ సిస్టర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: