స్థిరంగా కొనసాగుతున్న పసిడి..హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర స్థిరంగా ఉంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. దీంతో రేటు రూ.49,800కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణించింది. రూ.45,650కు చేరింది. వెండి ధర నిన్న ఏకంగా రూ.4,700 పతనమైంది. దీంతో వెండి ధర రూ.66,000కు క్షీణించింది. ఈరోజు 200 పెరిగి 66,200 వద్ద కొనసాగుతుంది.