పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్..రూ.600కు పైగా దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.660 పడిపోయింది. రూ.50,460 నుంచి రూ.49,800కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.46,100 నుంచి రూ.45,650కు క్షీణించింది. బంగారం తగ్గితే , వెండి కూడా అదే దారిలో నడిచింది. నిన్న కాస్త తగ్గిన ధర ఈరోజు పైకి కదిలింది. వెండి ధర కేజీకి భారీగా పెరిగింది. వెండి ధర గత 8 రోజుల్లో ఏకంగా రూ.2,000 పైకి కదిలింది. రూ.71,400 నుంచి రూ.73,400కు ఎగసింది.