పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.48,290 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.44,250 వద్దనే స్థిరంగా ఉంది.బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.75,000కు చేరింది.