హైదరాబాద్ మార్కెట్ లో ఆదివారం బంగారం ధరలు చూస్తే.. ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 43,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 280 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది... బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటె కాస్త పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 400 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 73,800 రూపాయల వద్ద నమోదు అయింది.