
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోతుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఈ బంగారం ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. ఈ భారీ ధరల కారణంగా సామాన్య, మధ్య తరగతి వర్గాలు బంగారం కొనడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. తులం బంగారం ధర ఏకంగా 49 వేలు ఉంది. ఏ సామాన్యుడు ఆయినా 49 వేలు పెట్టి బంగారం ఎప్పుడు కొనాలి.
ఇంకా ఇప్పుడు ఇది అంత పక్కన పెడితే.. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం డిమాండ్ భారీగా ఉంది అని అందుకే బంగారం ధరలు భారీగా పెరిగాయి అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏలా ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి..
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల పెరుగుదలతో 49,710 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల పెరుగుదలతో 45,570 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 500 రూపాయిల పెరుగుదలతో 48,080 రూపాయలకు చేరింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతుంది. ఇలా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.