తాజాగా నేడు ఓ దశలో బంగారం ఔన్స్ కు 2060 డాలర్లకు చేరుకోగా, అలాగే వెండింగ్ ఔన్స్ ధర 27.2 డాలర్లకు చేరుకుంది. ఇలా బంగారు వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అగ్రరాజ్యాలు ప్రకటిస్తున్న ఉద్దీపనలు, ఓవైపు బలహీనపడుతున్న డాలర్ విలువ, కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అనేకమంది లోహాలపై ఇన్వెస్ట్ చేయడమే. ఇక నేడు తాజాగా బంగారు, వెండి ధరలు ధరలు చూస్తే... హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 500 పెరిగి రూ 58,320 కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 500 పెరిగి రూ. 53, 510 చేరుకుంది. వీటితో పాటు వెండి ధర చూస్తే.... కేజీ వెండి ధర రెండువేల రూపాయలు పెరిగి రూ. 73,500 కు చేరుకుంది. రానురాను బీదవారు మధ్యతరగతి ప్రజలు బంగారు, వెండి ఆభరణాలు కొనాలంటే కష్టమే.
ఇక ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం 2,200 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. జూలై 27న అత్యధిక గరిష్టాన్ని పసిడి బ్రేక్ చేసింది. అయితే తాజాగా 2,050 డాలర్లు దాటింది. పసిడి 52 వారాల కనిష్టస్థాయి చూస్తే 1,428 డాలర్లుఉందా, ఈ రెండిటిని చూస్తే దాదాపు 50 శాతం పెరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి