బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్...నేటి మార్కెట్ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ధరలు నేల చూపులు చూస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరగడంతో ఇప్పుడు దేశీయ మార్కెట్ లో బంగారం ధర కూడా భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా తగ్గినా బంగారం ధర నిన్న ఇంకాస్త దిగొచ్చింది..దీంతో ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 45 వేలకు పైన కొనసాగుతుంది..


హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. దీంతో రేటు రూ.46,970కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.360 పెరుగుదలతో రూ.43,050కు ఎగసింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర పెరిగి షాక్ ఇస్తుంది. వెండి ధరలు కూడా బంగారం ధర దారిలోనే నడిచింది. వెండి ధర ఏకంగా వెండి ధర కేజీకి రూ.800 దూసుకెళ్లింది. దీంతో రేటు రూ.73,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే కారణం.



ప్రస్తుత బంగారం రేట్లను ఆధారంగా చేసుకొని వెండి ధర కూడా పైకి వస్తుంది. నిన్న తగ్గిన కిలో వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. వెండి వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇది చేదు వార్తే.. ఇప్పుడు ప్రజలు అంతా బంగారం వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 1715 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.88 శాతం తగ్గుదలతో 26.45 డాలర్లకు దిగొచ్చింది.
ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: